పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నేడు జమ్మూకశ్మీర్‌లో బంద్‌కు జేకేహెచ్‌సీ, సీసీఐకే, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్ధతు ఇచ్చాయి. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్ల క్యాండిల్ లైట్లతో నిరసన తెలపనున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి. అటు పహల్గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని ప్రతీకారం తీర్సుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో #WeWantRevenge ట్రెండింగ్ చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను త్వరగా పట్టుకుని చంపేయాలని కోరుతున్నారు. ఇలాంటి వారికి భూమిపై జీవించే హక్క లేదని పేర్కొంటున్నారు. అటు పహల్గామ్ సమీపంలో నంబర్ ప్లేట్ లేని బైక్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్టు అనుమానిస్తున్నాయి. బైక్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి ఇవాళ ఎన్‌ఐఏ బృందాలు చేరుకోనున్నాయి.