కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల‌కు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన ఒవైసీ

Owaisi releases first list of 3 candidates For Karnataka Assembly Elections. అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు

By Medi Samrat
Published on : 5 March 2023 4:48 PM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల‌కు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన ఒవైసీ

Asaduddin Owaisi


ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో భాగంగా ముగ్గురి పేర్లను ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. కర్ణాటకలో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఇదివరకే ప్రకటించారు. అందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కర్ణాటకలోని మూడు అసెంబ్లీ స్థానాలలో ఎంఐఎం నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

బెలగావి నార్త్ నియోజకవర్గం నుంచి లతీఫ్ ఖాన్ పఠాన్, హుబ్లీ ధర్వాడ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి దుర్గప్ప కషప్ప బిజావాడ్, బసవన భాగేవాడి నియోజకవర్గం నుంచి అల్లాబక్ష్ మోహబూబ్ సాబ్ బీజాపూర్ పోటీ చేయనున్నట్టుగా AIMIM అధ్యక్షుడు ప్రకటించారు.


Next Story