ప్రమాణ స్వీకారం తర్వాత 'జై పాలస్తీనా' నినాదం చేసిన ఒవైసీ.. మంత్రులు ఫైర్‌

లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. కాగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి మరోసారి ఎంపీగా ఎన్నికైన అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో చేసిన‌ ప్రమాణ స్వీకారం కొత్త వివాదానికి తెర లేచింది. ప్రమాణ స్వీకారం ముగిశాక జై పాలస్తీనా అంటూ ఓవైసీ నినాదాలు చేశారు.

By Medi Samrat  Published on  25 Jun 2024 12:51 PM GMT
ప్రమాణ స్వీకారం తర్వాత జై పాలస్తీనా నినాదం చేసిన ఒవైసీ.. మంత్రులు ఫైర్‌

లోక్‌సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. కాగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి మరోసారి ఎంపీగా ఎన్నికైన అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభలో చేసిన‌ ప్రమాణ స్వీకారం కొత్త వివాదానికి తెర లేచింది. ప్రమాణ స్వీకారం ముగిశాక జై పాలస్తీనా అంటూ ఓవైసీ నినాదాలు చేశారు. దీంతో సోషల్ మీడియా యూజర్లు ఆయ‌న‌ను టార్గెట్ చేశారు.

జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా, తక్బీర్ అల్లా-హు-అక్బర్ అని ఒవైసీ తన ప్రమాణ స్వీకారాన్ని ముగించారు. ఈ ప్రకటనకు సంబంధించి ఒవైసీ అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ.. త‌న ప్ర‌క‌ట‌న‌ను స‌మ‌ర్ధించుకున్నారు. జై పాలస్తీనా అంటే త‌ప్పేంటి అని ప్ర‌శ్నించారు. ప్రమాణం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్లోగన్ ఇచ్చారు. నేను కేవలం జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని చెప్పాను. అది ఎలా తప్పవుతుంది? రాజ్యాంగంలో ఉందా? చూపించండి. పాలస్తీనా గురించి మహాత్మా గాంధీ ఏం చెప్పారో చదువుకోండి అని మీడియాతో అన్నారు

ఈరోజు పార్లమెంట్‌లో ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ‘జై పాలస్తీనా’ నినాదం పూర్తిగా తప్పని, ఇది సభా నిబంధనలకు విరుద్ధమని, భారతదేశంలో ఉంటూ జై భారత్ మాతా అనడం లేదని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో ఉంటూనే రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

పాలస్తీనాతో లేదా మరే ఇతర దేశంతో మాకు శత్రుత్వం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. మరి అలాంటి దేశం కోసం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నినాదాలు చేయడం నిబంధనలకు లోబడి ఉంటుందా లేదా అనేది చూడాలన్నారు.

ఒవైసీ చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. @AshishSogun_ హ్యాండిల్ ద్వారా ఒక వినియోగదారు.. భారతదేశం మీకు ఓటు వేసింది, పాలస్తీనాకు కాదు. మరో వినియోగదారు @Abhishek_UP_.. మీరు పాలస్తీనాకు వెళ్లి అక్కడ నివసించడం ఎందుకు ప్రారంభించకూడదు అని ప్ర‌శ్నించారు. @Shivam_h9.. పాలస్తీనాను మధ్యలోకి తీసుకువ‌చ్చినందుకు ఆయ‌న‌పై చర్య తీసుకోవాలి. వాట్ నాన్సెన్స్.. అంటూ మ‌రొక‌రు ఫైర్ అయ్యారు.

Next Story