Thunderbolts : ఒడిశాలో పిడుగుల వాన.. 30 నిమిషాల్లో 5000కు పైగా పిడుగులు

ఒడిశా రాష్ట్రంలోని బసుదేవ్‌పూర్ ప్రాంతంలో బుధవారం కేవలం 30 నిమిషాల వ్యవధిలో 5000 పిడుగులు పడ్డాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2023 2:42 AM GMT
Odisha, Thunderbolts

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


సాదార‌ణంగా వర్షాకాలంలో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన‌లు ప‌డుతుంటాయి. అదే స‌మ‌యంలో ప‌లు చోట్ల పిడుగులు ప‌డుతూ ఉంటాయి. పిడుగు ఎక్క‌డో ప‌డినా మ‌న‌కు స‌మీపంలోనే ప‌డిన‌ట్లు అనిపిస్తుంది. పిడుగు శ‌బ్ధం విన‌గానే మన‌లో కొంద‌రికి భ‌యం ఆవ‌హిస్తుంది. మామూలుగా అయితే.. ప‌దో, ఇర‌వై పిడుగుల ప‌డిన ఘ‌ట‌న‌లు మ‌న‌కు తెలుసు. అయితే.. అర‌గంట వ్య‌వ‌ధిలో ఐదు వేల‌ పిడుగులు పిడితే ఏలా ఉంటుంది. ఆ శ‌బ్ధాల‌కు భూమి దద్ద‌రిల్లింది. ఈ ఘ‌ట‌న ఎక్క‌డో విదేశాల్లో జ‌ర‌గ‌లేదు. మ‌న‌దేశంలోని ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

భద్రక్ జిల్లాలోని బసుదేవ్‌పూర్ ప్రాంతంలో బుధవారం కేవలం 30 నిమిషాల వ్యవధిలో 5000పైగా పిడుగులు పడ్డాయి. ఈ విషయాన్ని ఐఎండీ భువనేశ్వర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. దాస్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా వ్రాశాడు, “భద్రక్‌లోని బసుదేవ్‌పూర్ సమీపంలో కేవలం 30 నిమిషాల వ్యవధిలో 5450 పిడుగులు పడ్డాయి. ఉరుములతో సంబంధం ఉన్న దుర్బలత్వం. అది ఎంత ప్రాణాంతకం కావచ్చు అనేది మీ ఊహకు మించినది కాదు. "ట్వీట్ చేశారు.

క్యుములోనింబ‌స్ మేఘాలు రాపిడికి గురైన‌ప్పుడు ఇలా జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు గ‌తంలోనూ జ‌రిగాయ‌న్నారు. ప్ర‌తి పిడుగుపాటును గుర్తించే అత్యాధునికి సాంకేతిక‌త రాడార్ కేంద్రానికి ఉంద‌ని తెలిపారు.

పిడుగుపాటు కారణంగా బాసుదేవ్‌పూర్ సమీపంలో ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. భద్రక్ ఎస్పీ వరుణ్ గుంటుపల్లి మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా ఎలాంటి మరణానికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందలేదని తెలిపారు.

Next Story