ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యుమునా నదిలో గురువారం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళలు సహా అందులోని 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 40 మంది ఉన్నట్లు సమాచారం. పడవ మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మహిళా ప్రయాణికులు రక్షా బంధన్ జరుపుకోవడానికి తమ గ్రామానికి వెళ్లేందుకు పడవలో ప్రయాణిస్తుండగా ఈ దురదృష్టకర ఘటన జరిగింది. పడవలో ఉన్న వారిని ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
గల్లంతైన వారికి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని బందా పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బందాలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా పరిపాలన అధికారులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మార్క బోటు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, 11 మందిని రక్షించినట్లు బండ పోలీసులు తెలిపారు.