రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేస్తూ జీవించిన అనాథ బాలిక.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.!

Orphan girl who lived by begging at Patna railway station. బీహార్‌లోని పాట్నాకు చెందిన ఒక బాలిక చిన్నతనంలో పాట్నా రైల్వే స్టేషన్‌లో వదిలివేయబడి, బాల్యాన్ని భిక్షాటన చేస్తూ

By అంజి  Published on  30 Jan 2022 7:21 AM GMT
రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేస్తూ జీవించిన అనాథ బాలిక.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.!

బీహార్‌లోని పాట్నాకు చెందిన ఒక బాలిక చిన్నతనంలో పాట్నా రైల్వే స్టేషన్‌లో వదిలివేయబడి, బాల్యాన్ని భిక్షాటన చేస్తూ తన విద్యను పూర్తి చేసి, దేశవ్యాప్తంగా లక్షల మంది బాలికలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కానీ నేడు ఆమె అపారమైన పట్టుదల, సంకల్పంతో ఆమె తన స్థానిక నగరంలో ఒక కేఫ్‌ (ఫలహారశాల) నడుపుతోంది. పందొమ్మిదేళ్ల జ్యోతికి ఇప్పటి వరకు తన అసలు తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. ఆమె చిన్నతనంలో పాట్నా రైల్వే స్టేషన్‌లో బిచ్చగాడు దంపతులచే వదిలివేయబడిందని ఆమె చెప్పింది. చాలా కష్టతరమైన రోజులను అనుభవించినప్పటికీ చాలా మంది మంచి సమరిటన్ల సహాయంతో జీవితంలో ముందుకు సాగుతూనే ఉన్నానని ఆమె చెప్పింది.

తనను దత్తత తీసుకున్న బిచ్చం అడుక్కునే దంపతులతో కలిసి చిన్నతనంలో తాను కూడా భిక్షాటన చేయడం ప్రారంభించానని జ్యోతి చెబుతోంది. భిక్షాటన చేసి తక్కువ డబ్బు సంపాదించింది. ఆ తర్వాత చెత్తను తీయడం ప్రారంభించింది. ఆమె జీవితం ముందుకు సాగుతోంది. కానీ చదువుకోవాలనే కోరిక ఆమె మనస్సులో ఖచ్చితంగా ఉంది. ఆమె బాల్యం చదువు లేకుండానే గడిచిపోయింది కానీ చదువు పూర్తి చేయాలనే కోరిక ఆమె స్ఫూర్తిని అడ్డుకోలేదు. తాను చదువుకునేటప్పుడు తనను పెంచిన తల్లిని కోల్పోయింది. విపరీతమైన కష్టాలు ఎదురైనా జ్యోతి అంత తేలిగ్గా వదలలేదు.

రాంబో ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మెరుగైన జీవితాన్ని గడపడానికి పాట్నా జిల్లా యంత్రాంగం ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె జీవితంలో ముందుకు సాగాలనే కలలను ఇంకా పెంచుకుంటూనే ఉంది. రాంబో ఫౌండేషన్ బీహార్ హెడ్ విశాఖ కుమారి మాట్లాడుతూ.. పాట్నాలో ఐదు కేంద్రాలు ఉన్నాయని, ఇక్కడ పేద, అనాథ బాలబాలికలను ఉంచి విద్యను అందిస్తున్నామని చెప్పారు. జ్యోతి రాంబో ఫౌండేషన్‌లో చేరిన తర్వాత, ఆమె తన చదువును కొనసాగించి మెట్రిక్యులేషన్ పరీక్షలో అసాధారణమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.

దీని తరువాత, ఆమె ఉపేంద్ర మహారథి ఇనిస్టిట్యూట్‌లో మధుబని పెయింటింగ్స్‌లో శిక్షణ పొందింది. పెయింటింగ్ కూడా నేర్చుకుంది. జ్యోతి మాత్రం సంతృప్తి చెందలేదు. ఆమె కృషి, అభిరుచితో ఆమెకు ఒక సంస్థలో ఫలహారశాల నడుపుతున్న ఉద్యోగం వచ్చింది. రోజంతా ఫలహారశాల నడుపుతున్నానని, ఖాళీ సమయాల్లో చదువుకుంటానని చెప్పింది. ఈరోజు ఆమె సొంత సంపాదనతో అద్దె ఇంట్లో ఉంటోంది. జ్యోతి మార్కెటింగ్ రంగంలో కెరీర్‌ను సంపాదించుకోవాలని కలలు కంటోంది. ఇప్పటికీ ఓపెన్ స్కూల్ లెర్నింగ్ ద్వారా తన చదువును కొనసాగిస్తోంది.

Next Story