మళ్లీ ఘాటెక్కుతున్న ఉల్లి ధర.. కిలోకు రూ.70

Onion Price Hike in India. ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతుంటే ఇప్పుడు ఉల్లి ధరలు కూడా

By Medi Samrat  Published on  23 Feb 2021 11:21 AM IST
Onion Price Hike in India

ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతుంటే ఇప్పుడు ఉల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి భారమైపోతోంది. గతంలో ఉల్లి ధరలు కన్నీళ్లు పెటించి సాధారణ ధరల లభిస్తున్నాయనుకుంటే ఇప్పుడు మళ్లీ ఉల్లి ఘాటెక్కిపోతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబైలో గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది మొదట్లో ఉల్లి ధర రూ.25 నుంచి 30 రూపాయలు ఉండగా, ప్రస్తుతం కిలో ఉల్లి ధర 60 నుంచి 70 రూపాయల వరకు చేరుకుంది. దీంతో ప్రజలు మళ్లీ లబోదిబోమంటున్నారు. గత ఏడాది కురిసిన వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట అధికంగా నాశనమైపోయింది. దీంతో ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కిపోతోంది.

ఉత్పత్తి లేకపోవడం కారణంగా సరఫరా కూడా తగ్గిపోయింది. ఇప్పుడు దాని ప్రభావం ధరలపై కనిపిస్తోంది. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెండు రేట్లపైగా పెరిగింది. నవీ ముంబైలో ఏపీఎంసీ మార్కెట్లో గతంలో ఉల్లిపాయ కిలోకు రూ.30-40 హోల్‌ సేల్‌ ధరకు అమ్మేవారు. ముంబై, పూణే, థానే రిటైల్‌ మార్కెట్లలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 నుంచి 70 వరకు అమ్మడవుతోంది.

కాగా, దేశంలో అతిపెద్ద హోల్‌ సేల్‌ ఉల్లి మార్కెట్‌ లాసల్‌గావ్‌లోఉల్లి టోకు రేటు గత 10 రోజుల్లో 15 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ ప్రకారం.. రిలైల్‌లో ఉల్లిపాయ ధలోకు రూ.54 ఉంది. మరోవ ఐపు చమురు ధరలు వరుసగా పెరుగుతుండటం కూడా ప్రధాన కారణమనే చెప్పాలి. ఎందుకంటే సరుకు రవాణా మరింత ఖరీదైనది. జనవరి 1న ఢిల్లీలో డీజిల్‌ ధర లీటరుకు రూ.73.87 ఉండగా, నేడు రూ.78.38కి చేరింది.




Next Story