ఢిల్లీ అల్లర్లపై పోలీస్ ప్రత్యేక నిఘా...దీప్ సిద్ధూ ఆచూకీ వెల్లడిస్తే రూ.లక్ష రివార్డు..!

One lakh reward for information on Deep Sidhu. హింసాత్మక ఘటనలతో సంబంధమున్నట్లు దీప్ సిద్ధూపై సమాచారం అందిస్తే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

By Medi Samrat  Published on  3 Feb 2021 7:51 AM GMT
One lakh reward for information on Deep Sidhu

రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్ధూపై సమాచారం అందిస్తే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. జనవరి 26 కిసాన్ పరేడ్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద 44 కేసులను నమోదు చేసి, చాలా మందిని అరెస్టు చేశారు.

కాగా ఈ ఘటనల్లో దీప్‌ సిధుతోపాటు మరికొంత మందికి సంబంధముందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సిధుతోపాటు జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జాంత్ సింగ్‌పై కూడా లక్ష రివార్డును ప్రకటించారు. సిద్దూతో పాటు ఆ ఘటనతో సంబంధమున్నట్లు భావిస్తున్న జగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గర్జాంత్ సింగ్ల ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష బహుమానం ఇస్తామని తెలిపారు.

అంతే కాదు జజ్బీర్ సింగ్, బుటా సింగ్, సుఖ్దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్లను అరెస్టు చేసేలా సమాచారం ఇచ్చినవారికి రూ.50వేలు రివార్డుగా ఇస్తామని ఢిల్లీలో పోలీసులు చెప్పారు. దీప్ సిధుతోపాటు నేరుగా సంబంధమున్న వారంతా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తున్నారు. దీప్ సిధు బీహార్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎర్రకోట ఘటనకు సంబంధించి పోలీసులు 12 మంది ఫొటోలను విడుదల చేశారు.


Next Story
Share it