రేపే జూన్ 1.. అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే
జూన్ 1వ తేదీ నుంచి పలు కీలక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి.
By అంజి Published on 31 May 2024 7:00 AM IST
రేపే జూన్ 1.. అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే
జూన్ 1వ తేదీ నుంచి పలు కీలక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి.
ఆధార్ కార్డ్ అప్‌డేట్
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. కేంద్రం ప్రభుత్వం కొన్ని నెలల కిందట ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఫ్రీగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు జూన్ 14తో ముగియనున్నది. ఈ గడువు తేదీ ముగిసిన తర్వాత ప్రతీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు గడువులోగా ఆధార్ అప్ డేట్ చేసుకుంటే ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు
డ్రైవింగ్ లైసెన్స్
సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కి అర్హత సాధించవచ్చు. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో కేంద్రాలకు వెళ్లకుండానే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో సర్టిఫికేట్ తీసుకుని ఆర్టీవోల ద్వారా లైసెన్స్ పొందేలా కొత్త రూల్ ప్రవేశపెట్టింది.
ట్రాఫిక్స్ రూల్స్
మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ వెహికిల్ రిజిస్ట్రేషన్‌ని రద్దుచేస్తారు. ఆ మైనర్‌కు పాతికేళ్లు వచ్చేంత వరకూ డ్రైవింగ్ చేయకుండా ఆంక్షలు విధిస్తారు. ఓవర్ స్పీడ్‌కి రూ.వెయ్యి నుంచి 2 వేల వరకూ జరిమానా విధించనున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు.
గ్యాస్ ధరలు
నిత్యావసరమైన గ్యాస్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఈ సారి సిలిండర్ ధరలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. లేదంటే నిలకడగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో రేపు ఉదయం తెలుస్తుంది. అందువల్ల సిలిండర్ ధరలు ఎలా అయినా కదలొచ్చు. పెరిగితే మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంది.