జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు.

By అంజి  Published on  16 Oct 2024 12:19 PM IST
Omar Abdullah, JammuKashmir Chief Minister, Surinder Choudhary, National news

జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా.. అబ్దుల్లాతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు.

జమ్మూకశ్మీర్‌లో ఆరేళ్ల తర్వాత తొలి ప్రభుత్వం ఏర్పడింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా బుధవారం జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో నౌషెరా నుండి జమ్మూ కశ్మీర్‌ బిజెపి చీఫ్ రవీందర్ రైనాను ఓడించిన స్వతంత్ర ఎమ్మెల్యే సురీందర్ సింగ్ చౌదరి, కొత్త ప్రభుత్వంలో జమ్మూకు ప్రాతినిధ్యం కల్పించి ఉప ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు.

శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కెఐసిసి)లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలు - సతీష్ శర్మ (స్వతంత్ర), సకీనా ఇటూ, జావిద్ దార్, సున్రీందర్ చౌదరి, జావిద్ రాణా (అందరూ నేషనల్ కాన్ఫరెన్స్ నుండి).

ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయబడిన తర్వాత, 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత అధికారం చేపట్టిన మొదటి వ్యక్తి.

2009 నుండి 2014 వరకు జమ్మూ కాశ్మీర్, అప్పటి రాష్ట్రాన్ని నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి పాలించినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు.

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను ఉటంకిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రస్తుతానికి మంత్రివర్గంలో చేరదని జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా అన్నారు.

ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రివర్గంలో చేరడం లేదు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కాంగ్రెస్ కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేసింది.

Next Story