11 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా..!
Old man take 11 doses of covid vaccine in Bihar.కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే టీకా వేయించుకోవాలని
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2022 4:30 AM GMTకరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే టీకా వేయించుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పటికి కొందరు మాత్రం టీకా తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సార్లు టీకా తీసుకున్నట్లు చెప్పాడు. అంతేకాదండోయ్ ఏ ఏ తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ తీసుకున్నాడో కూడా ఆ వివరాలను ఓ పేపర్ పై రాసిపెట్టుకున్నాడు. టీకా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందుకనే అన్ని సార్లు తీసుకున్నట్లు చెప్పాడు. ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన యంత్రాంగం ఈ ఘటనపై విచారణ చేపట్టింది.
వివరాల్లోకి వెళితే.. మాధేపురా జిల్లా ఉదకిషన్‌గంజ్ సబ్ డివిజన్ ఒరాయ్ గ్రామంలో బ్రహ్మదేవ్ అనే 84 ఏళ్ల వృద్దుడు నివసిస్తున్నాడు. పోస్టల్ శాఖలో పనిచేసి రిటైర్‌మెంట్ అయి.. ప్రశాంత జీవనం సాగిస్తున్నాడు. తొలి డోసును ఫిబ్రవరి 13, 2021 తీసుకున్నట్లు చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 డోసులు పొందినట్లు చెప్పాడు. ఏయే తేదీల్లో టీకాలు తీసుకున్నది ఓ పేపర్‌పై రాసిపెట్టుకున్నాడు. 12వ డోసు తీసుకునేందుకు స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళితే.. అప్పటికే టీకా కార్యక్రమం ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక ఈ ఘటన సంచలనం సృష్టించడంతో జిల్లా యంత్రాగం విచారణకు ఆదేశించింది. అతడు అన్ని సార్లు ఎలా టీకా తీసుకున్నాడు అనే విషయాలపై ఆరా తీస్తోంది.