పాము కరిచిందని.. ప్రతీకారం తీర్చుకున్నాడు
Odisha man bites snake in revenge in Jajpur district.చాలా మందికి పాములను చూస్తేనే చాలు భయం వేస్తోంది.
By తోట వంశీ కుమార్
చాలా మందికి పాములను చూస్తేనే చాలు భయం వేస్తోంది. అవి ఎక్కడ కాటు వేస్తాయోనని. పాములు కనబడితే చాలు అక్కడి నుంచి జారుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి పాము కాటువేసిందని తెలిసి దానిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. తనను కరిచిన పాము ప్రాణాలు పోయే వరకు కొరికి కొరికి చంపాడు. ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జాజ్‌పూర్ జిల్లాలోని గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్ర (45)అనే రైతు బుధవారం రాత్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో అతని కాలిని ఏదో కరిచింది. వెంటనే తన చేతిలోని టార్చ్ వేసి చూడగా.. తనను పాము కరించిందని గుర్తించాడు. చుట్టు పక్కల వెతుకకగా.. పాము కనిపించింది. వెంటనే కోపంతో పామును పట్టుకుని నోటితో పదే పదే కొరికాడు. దీంతో పాము ప్రాణాలు కోల్పోయింది. ఆ పామును అలాగే తీసుకుని ఇంటికి చేరుకున్నాడు.
జరిగిన విషయాన్ని గ్రామస్థులతో పాటు భార్యకు చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పామును కరిచిన కిషోర్ బద్రకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే.. గ్రామస్తులు మాత్రం అతడు ఆస్పత్రికి వెళ్లలేదు కానీ.. నాటు వైద్యం చేయించుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.