బిగ్‌బ్రేకింగ్‌.. రెండు వారాలు కంప్లీట్‌ లాక్‌డౌన్

Odisha government announced two weeks complete lockdown.రాష్ట్ర వ్యాప్తంగా మే 5 నుంచి 19 వ‌ర‌కు తేదీ వ‌ర‌కు 14 రోజుల పాటు క‌ఠిన లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2021 11:54 AM IST
lockdown in odisha

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. దీంతో ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప‌లు రాష్ట్రాలు చివ‌రి అస్త్రంగా లాక్‌డౌన్‌ను ప్ర‌మోగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మ‌రో రాష్ట్రం కూడా చేరింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లో లాక్ డౌన్ విధించ‌గా.. ఒడిశా కూడా ఆ బాట‌లోనే ప‌య‌నించింది. ఒడిశాలో గ‌త కొద్ది రోజులుగా నిత్యం 5వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో వ్య‌వ‌ధిలో 10వేల‌కు పైగా కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ప్ర‌భుత్వం ఒడిశా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 5 నుంచి 19 వ‌ర‌కు తేదీ వ‌ర‌కు 14 రోజుల పాటు క‌ఠిన లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెలిపారు. ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థనూ బంద్ పెడుతున్నట్టు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కబోవని, ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.

ఎలాంటి అత్యవసర కారణాలను చూపించకుండా రోడ్డెక్కిన వాహనాలను స్వాధీనం చేసుకుంటామని, వారి లైసెన్స్‌ను రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతినిచ్చారు. అయితే దానికి ఓ షరతు పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపే ఏది కావాలన్నా కొనుగోలు చేయాలని సూచించింది. అది కూడా అర కిలోమీటరు దూరంలోపున్న షాపులు లేదా కూరగాయల దుకాణాలకే నడుచుకుంటూ వెళ్లాలని తెలిపింది. వైద్య సేవలు, నిత్యావసర సేవలు అందించే వాహనాలపై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవని పేర్కొంది.




Next Story