ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు గ్యాస్ బుక్ అవుతుంది!

Now give a missed call to this number to book your cylinder. ఇండియన్ గ్యాస్ వినియోగదారులు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు గ్యాస్ బుక్ అవుతుంది.

By Medi Samrat  Published on  3 Jan 2021 9:33 AM IST
cylinder booking

ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ వంట చేయటానికి గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇది వరకు గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడం కోసం సంబంధిత గ్యాస్ సంస్థలు కస్టమర్ల కోసం ఒక నెంబర్ ను అందుబాటులోకి తెచ్చాయి. ఆ నెంబర్ కి డయల్ చేసి గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఇప్పుడు గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు మరింత సులభమైన అవకాశాన్ని కల్పించింది.

దేశవ్యాప్తంగా ఇండేన్ గ్యాస్ ఉపయోగించే కస్టమర్ల కోసం ఇండియన్ ఆయిల్ సంస్థ "మిస్డ్ కాల్"సేవలను దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చింది. ఈ సేవల ద్వారా ఎవరైతే గ్యాస్ రీఫిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా '84549 55555' నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు గ్యాస్ బుకింగ్ అవుతుందని ఇండియన్ ఆయిల్ సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఇండేన్ గ్యాస్ వినియోగదారుల సౌకర్యార్థం ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు, దేశ వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ సేవలో మెట్రో నగరాలైన ముంబై, కలకత్తా, బెంగళూరు వంటి నగరాలలో అందుబాటులో ఉన్నాయని ఇండియన్ సంస్థ పేర్కొంది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు ఇలాంటి సేవలు అందుబాటులో తీసుకురావటం వల్ల ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు గ్యాస్ బుకింగ్ చేసుకోవడం మరింత సులభతరం అవుతుందని చెప్పవచ్చు. ఇలాంటి సౌకర్యవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఇండియన్ ఆయిల్ సంస్థ పై ఇండేన్ గ్యాస్ కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇతర గ్యాస్ సంస్థలు కూడా ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకు వస్తే మరింత సులభతరంగా ఉంటుందని చెప్పవచ్చు.


Next Story