నిరుద్యోగులకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న 48 వేల గ్రామీణ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు జనవరి 29న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఏటా రెండు సార్లు ఖాళీలను పోస్టల్ శాఖ భర్తీ చేస్తోంది. గత సంవత్సరం జులైలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాకుండా మిగిలిన ఉద్యోగాలతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
టెన్త్ పాసైన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయసు 18 ఉంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులకు టెన్త్‌లో వచ్చిన మార్కులు (గ్రేడ్), రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు పరీక్ష ఫీజు ఉండదు. మిగతా అభ్యర్థులు దరఖాస్తులు ఫీజుగా రూ.100 చెల్లించాలి. రాష్ట్రాలవారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను నోటిఫికేషన్ పోస్టల్ శాఖ ప్రకటించనుంది.