ఆ దిగ్గజం పోటీ చేయడం లేదట

Not Running For Congress President, Says Digvijaya Singh. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబర్ 17న జరుగుతాయి, ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న ప్రకటించబడతాయి.

By Medi Samrat  Published on  23 Sep 2022 11:52 AM GMT
ఆ దిగ్గజం పోటీ చేయడం లేదట

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబర్ 17న జరుగుతాయి, ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న ప్రకటించబడతాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 24న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఇప్పటికి పలువురు నేతల పేర్లు పోటీలో నిలబడే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేరు కూడా అందులో ఉందని వార్తలు రాగా.. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడటం లేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

తాను పోటీ చేయబోనని, తనకు హైకమాండ్ ఇచ్చే సూచనలను పాటిస్తానని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి కేవలం అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మాత్రమే పోటీ చేస్తున్నారనే విషయం స్పష్టమయింది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన గెహ్లాట్ కే గెలిచే అవకాశాలు ఉన్నాయి. శశిథరూర్ కు మద్దతు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంది. ఆ తర్వాత బరిలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే.. అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు.


Next Story
Share it