కన్నడలో మెడికల్ ప్రిస్క్రిప్షన్ల ప్రతిపాదన.. సాధ్యం కాదన్న మంత్రి గుండూరావు

కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ.. కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావును ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలోని వైద్యులు రాష్ట్ర అధికారిక భాష అయిన కన్నడలో మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లను రాయాలని ఆదేశించాలని కోరింది.

By అంజి  Published on  10 Sept 2024 5:15 PM IST
Karnataka, minister Dinesh Gundu Rao, prescriptions, Kannada, Kannada Development Authority

కన్నడలో మెడికల్ ప్రిస్క్రిప్షన్ల ప్రతిపాదన.. సాధ్యం కాదన్న మంత్రి గుండూరావు

కన్నడ డెవలప్‌మెంట్ అథారిటీ (కెడిఎ) సోమవారం కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావును ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలోని వైద్యులు రాష్ట్ర అధికారిక భాష అయిన కన్నడలో మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లను రాయాలని ఆదేశించాలని కోరింది. కెడిఎ చైర్‌పర్సన్ పురుషోత్తం బిలిమలే దినేష్ గుండూరావుకు రాసిన లేఖలో.. కన్నడను ప్రోత్సహించే వైద్యులను ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని ప్రతిపాదించారు. భాషా వినియోగం పట్ల నిబద్ధత చూపిన వైద్యులను ఏటా వైద్యుల దినోత్సవం సందర్భంగా తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సత్కరించాలని ఆయన సూచించారు.

ప్రైవేట్ ఆసుపత్రులలో కన్నడను ప్రేమించే వైద్యులు, ఆసుపత్రి నిర్వాహకులతో పాటు, వారి అభ్యాసంలో భాషను ఉపయోగించేలా ప్రేరేపించబడే వాతావరణాన్ని పెంపొందించాలని బిలిమలే మంత్రిని గుండూరావును కోరారు. ఈ ఆలోచనకు మద్దతు ఇస్తూ వైద్య విద్యాశాఖ మంత్రి శరణప్రకాష్ పాటిల్.. ''కన్నడలో ప్రిస్క్రిప్షన్లు జారీ చేయాలనే ప్రతిపాదనలో తప్పు లేదు. చాలా మంది వైద్యులకు కన్నడ తెలుసు, అయితే ఇది సౌకర్యంగా ఉంటుంది. వారు కన్నడలో డ్రగ్ పేర్లను ఎలా రాయాలో కూడా నేర్చుకోవాలి'' అని అన్నారు.

కర్నాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు.. కేడీఏ లేఖపై స్పందించారు. "ప్రిస్క్రిప్షన్లు, వైద్య నిబంధనలకు అనువైనవిగా ఉండాలి. ఒక వైద్యుడికి కన్నడ తెలుసు. స్పష్టంగా రాయగలిగితే, వారు అలా చేయగలరు. అయితే, దానిని తప్పనిసరి చేయడం ఆచరణాత్మకంగా అనిపించదు'' అని అన్నారు.

“ప్రిస్క్రిప్షన్‌లు రోగి, వైద్యుడు ఇద్దరూ సౌకర్యవంతంగా ఉండే భాషలో ఉండాలి. ఇద్దరూ కన్నడను ఇష్టపడితే, దానిని ఉపయోగించవచ్చు, కానీ వైద్యులందరూ కన్నడలో రాయాలని ఆశించడం అసమంజసమైనది. వైద్య పదాలు, మందుల పేర్లు, రసాయన కూర్పులు ఆంగ్లంలో ఉన్నాయి. వాటిని కన్నడలోకి తప్పులు లేకుండా అనువదించడం సవాలుగా ఉంది. సూచన మంచిదే అయినప్పటికీ, అది ఆచరణ సాధ్యం కాదు” అని అన్నారు.

Next Story