కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం కేసుల్లో ఎక్కువ శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ప్యూ విధించింది. అయితే.. దేశ వ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామని, తాజాగా విధించిన రాత్రి కర్ఫ్యూతో తమ వ్యాపారాలు మరింత దెబ్బతింటున్నాయని ఠానేకు చెందిన హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్ కారణంగా నష్టపోయినా.. ఇప్పడిప్పుడే కోలుకుంటున్నాయని ఇలాంటి సమయంలో రాత్రి కర్ఫ్యూ విధిచండంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా తమ డిమాండ్లు నెరవేరే దాకా జిల్లా వ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్ ఫీజును వాయిదాల వారీగా చెల్లించేందుకు అనుమతించడంతో పాటు రాత్రి 8 గంటల నుంచి విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని కోరుతున్నారు. ఠానే తో పాటుగా డొంబ్లివి, కళ్యాణ్, నవీ ముంబై లో కూడా మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్టు హోటళ్ల వ్యాపారుల సంఘం ప్రకటించింది.