దారుణం.. తక్కువ కులం వైద్యుడు పోస్ట్‌మార్టం చేశాడని.. ఏకంగా శవాన్నే వెలేశారు
No one at Odisha man's funeral over autopsy by 'low caste' doctor. తక్కువ కులానికి చెందిన వైద్యుడు పోస్టుమార్టం చేసినందుకు.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా
By అంజి Published on 26 Sept 2022 12:45 PM ISTతక్కువ కులానికి చెందిన వైద్యుడు పోస్టుమార్టం చేసినందుకు.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా వేలేశారు బంధువులు. దీంతో మృతదేహాన్ని ఓ వ్యక్తి దహన సంస్కరాల కోసం బైక్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దినసరి కూలీ చేసుకునే ముచ్చును సంద అనే వ్యక్తి గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి గర్భవతి అయిన భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారు.
ఇటీవల అతడి ఆరోగ్యం విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలోనే అతనికి శవపరీక్ష నిర్వహించబడింది. ముచ్చును సంద మృతదేహాన్ని శుక్రవారం అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు. గ్రామంలో ముచ్చును మృతదేహం అతని ఇంటి లోపల ఉంచారు. సందకు తక్కువ కులం వ్యక్తం పోస్టుమార్టం చేశాడని తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు.. అతని ఇంటి వైపు చూడలేదు. అదే సమయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త సునీల్ బెహెరా తన బైక్‌పై మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ముచ్చును సంద మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి గ్రామానికి తీసుకొచ్చిన అంబులెన్స్‌కు చందాలు వసూలు చేసి డబ్బులు ఇచ్చి సునీల్ సహాయం చేశాడు. ఆ తర్వాత చాపలో శవాన్ని చుట్టి తన బైకు మీద తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. సునీల్ బెహెరా మాట్లాడుతూ.. '' సంద చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తుండగా మృతి చెందాడు. మేము సుమారు రూ. 8,000 వసూలు చేసి అంబులెన్స్‌కి చెల్లించాము.'' అని చెప్పాడు. అయితే సునీల్.. మృతదేహా బహిష్కరణ గురించి ప్రశ్నలను తప్పించుకున్నాడు. మృతదేహానికి శవపరీక్షపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శవపరీక్షలు చేసిన వారి అంత్యక్రియలకు వారు రావడం లేదు. కుటుంబంలో మగ సభ్యులు లేనందున, నేను నా బైక్‌పై మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లాల్సి వచ్చింది'' అని అతను చెప్పాడు.
మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లమని సునీల్ అంబులెన్స్ డ్రైవర్, ఇతరులను కోరాడు. వారు అంగీకరించారు. అయితే రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అంబులెన్స్‌ను మధ్యలోనే ఆపేయడంతో సునీల్ మృతదేహాన్ని బైక్‌కు కట్టేసి అంబులెన్స్ డ్రైవర్, సహాయకుల సాయంతో దహన సంస్కారాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు.