హైవే ప్రయాణికులకు అలర్ట్..ఏప్రిల్ 2026 నుంచి టోల్ ప్లాజాల వద్ద నో క్యాష్

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది.

By -  Knakam Karthik
Published on : 20 Feb 2026 8:21 PM IST

National News, Toll Plaza, Fastag, Digital India, Highways, National Highways

హైవే ప్రయాణికులకు అలర్ట్..ఏప్రిల్ 2026 నుంచి టోల్ ప్లాజాల వద్ద నో క్యాష్

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇకపై టోల్ రుసుములను కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ మార్గాల్లోనే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం దేశంలో 98 శాతానికి పైగా వాహనదారులు ఇప్పటికే ఫాస్టాగ్ వాడుతుండటంతో, టోలింగ్ వ్యవస్థను వంద శాతం పారదర్శకంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ విధానం అమలులోకి వస్తే టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లు తగ్గడమే కాకుండా, ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. ఇప్పటికే ఫాస్టాగ్ ఉండి కూడా నగదు చెల్లిస్తే రెట్టింపు వసూలు చేస్తున్న ప్రభుత్వం, త్వరలో నగదు కౌంటర్లను పూర్తిగా ఎత్తివేసి జాతీయ రహదారులపై ప్రయాణాన్ని 'క్యాష్‌లెస్'గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story