దీపావ‌ళి బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. "ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా.. నో ఫైన్స్".. వారం రోజులే

No fine for traffic violation in this state for 7 days because Diwali.అక్టోబ‌ర్ 21 నుంచి 27 వ‌ర‌కు ట్రాఫిక్ నిబంధ‌న‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2022 2:36 AM GMT
దీపావ‌ళి బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా.. నో ఫైన్స్.. వారం రోజులే

దీపావ‌ళి పండుగ స‌మీపిస్తున్న త‌రుణంలో సాధార‌ణంగా షాపులు, మాల్స్‌ల‌లో పండుగ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. ఆఫీసుల్లో ఉద్యోగుల‌కు దీపావ‌ళి బోన‌స్సులు ఇస్తుంటారు. ఇక‌.. కొన్ని రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు కూడా ఏదో ఒక జ‌నాక్ష‌ర‌ణ ప‌థకాల‌ను ప్ర‌వేశ‌పెడుతుంటాయి. అయితే.. ఓ రాష్ట్ర ప్ర‌భుత్వం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21 నుంచి 27 వ‌ర‌కు వారం రోజుల పాటు ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినా ఎటువంటి జ‌రిమానాలు విధించ‌మ‌ని చెప్పింది. అయితే.. ఇది మ‌న తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. గుజ‌రాత్ రాష్ట్రంలో.

ఈ విష‌యాన్ని గుజ‌రాత్ రాష్ట్ర‌ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. శుక్ర‌వారం సూర‌త్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడుతూ.. "అక్టోబ‌ర్ 21 నుంచి 27 వ‌ర‌కు రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినా ఎటువంటి జ‌రిమానాలు ఉండ‌వు. దీపావ‌ళి నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. అలా అని మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాల‌ని అని కాదు. మీరు త‌ప్పుచేసినా పోలీసులు ఫైన్లు వేయ‌రు. మీకు పువ్వులు ఇచ్చి ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాల‌ని చెబుతారు" అని హ‌ర్ష్ సంఘ‌వి చెప్పుకొచ్చారు.

ఇక దీనిపై నెటీజ‌న్లు స్పందిస్తున్నారు. కొంద‌రు మంత్రి నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం త‌ప్పు ప‌డుతున్నారు. కొంద‌రు.. "ఇది స్వచ్ఛందంగా నిబంధనలను అనుసరించమని ప్రజలను ప్రోత్సహిస్తుందని చెప్ప‌గా".. మ‌రికొంద‌రు "ఇది నగరాల్లో ట్రాఫిక్ గజిబిజిని మరింత దిగజార్చడానికి దారితీస్తుందని" కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనా ప్ర‌స్తుతం మంత్రి మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇలాంటి రూల్ మా రాష్ట్రాల్లో కూడా ఉంటే బాగుండు అంటూ పలువురు నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story