బీహార్ లో త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 19 లేదా 20 తేదీల్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా మరోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ పగ్గాలు చేపట్టనున్నారు. రేపు నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, ఆ లేఖను గవర్నర్ కు పంపనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత నితీశ్ రాజీనామా చేయనున్నారు. అలాగే రేపు NDA భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్షాలు సమావేశాలు నిర్వహించనున్నాయి.
బీహార్ ముఖ్యమంత్రిగా ఇప్పటికే 9 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ త్వరలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశంలోనే ఒక రాష్ట్రానికి అత్యధిక సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నితీశ్ రికార్డులకెక్కనున్నారు. బీహార్ లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు NDA పక్షాలు గవర్నర్ అనుమతిని కోరనున్నాయి.