రేపే బీహార్‌ అసెంబ్లీలో నితీశ్‌ సర్కారుకు బలపరీక్ష

బీహార్‌లో కీలకమైన విశ్వాస పరీక్షకు ఒక రోజు కంటే తక్కువ సమయం మిగిలి ఉంది. నితీష్‌ సర్కార్‌ తన మిత్రపక్షమైన బీజేపీతో కలిసి బల పరీక్షకు సిద్ధమైంది.

By అంజి  Published on  11 Feb 2024 2:00 PM GMT
Nitish Govt, Floor Test, JDU, BJP, Congress MLAs, Tejashwi Yadav

రేపే బీహార్‌ అసెంబ్లీలో నితీశ్‌ సర్కారుకు బలపరీక్ష

బీహార్‌లో కీలకమైన విశ్వాస పరీక్షకు ఒక రోజు కంటే తక్కువ సమయం మిగిలి ఉన్నందున, తెలంగాణలోని రంగారెడ్డిలోని రిసార్ట్‌లో వారం రోజులుగా మకాం వేసిన కాంగ్రెస్ శాసనసభ్యులు తిరిగి పాట్నాకు ఆదివారం సాయంత్రం వెళ్లారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నేరుగా మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నివాసానికి వెళ్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ 43 స్థానాలనే గెలుచుకుంది. బీజేపీ దాని ఇతర మిత్రపక్షాలు 82 స్థానాల్లో విజయం సాధించాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడంతో నితీశ్‌కుమార్‌ సీఎంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత నితీశ్‌ బీజేపీతో తెగదెంపులు చేసుకుని.. ఆర్జేడీతో కలిసి మరోసారి సీఎంగా మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

తాజాగా ఆర్జేడీతో దోస్తీకి కటిఫ్‌ చెప్పి మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్‌ రేపు బలపరీక్ష ఎదుర్కోబోతున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీ 75, కాంగ్రెస్‌ 19, సీపీఐ (ఎంఎల్‌) 12 తో కలిపి మహాకూటమి బలం 110గా ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. ఎన్డీఏ కూటమికి అవసరమైన బలం ఉంది. బీజేపీ 74, జేడీయూ 43తో కలిపి 125 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలంగా ఉంది. అయితే చివరి సమయంలో ఏదైనా తేడా జరిగితే తప్ప నితీశ్‌ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గడం ఖాయం.

Next Story