'బెంగాల్, కేరళ, తమిళనాడు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుస్తాం' : బీజేపీ నూత‌న అధ్యక్షుడు నితిన్ నబిన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్ మంగళవారం మాట్లాడుతూ.. తాను కేవలం పదవిని చేపట్టడం లేదు.. పార్టీ సిద్ధాంతాలు, సంప్రదాయాలు, జాతీయవాద ఉద్యమ బాధ్యతను స్వీకరిస్తున్నానని అన్నారు.

By -  Medi Samrat
Published on : 20 Jan 2026 3:48 PM IST

బెంగాల్, కేరళ, తమిళనాడు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుస్తాం : బీజేపీ నూత‌న అధ్యక్షుడు నితిన్ నబిన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్ మంగళవారం మాట్లాడుతూ.. తాను కేవలం పదవిని చేపట్టడం లేదు.. పార్టీ సిద్ధాంతాలు, సంప్రదాయాలు, జాతీయవాద ఉద్యమ బాధ్యతను స్వీకరిస్తున్నానని అన్నారు. విక‌సిత్ భార‌త్‌ కోసం కృషి చేస్తున్న 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషిని నొక్కిచెప్పిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుతో తనలాంటి సామాన్య కార్యకర్త ఉన్నత పదవికి చేరుకునే అవకాశం వచ్చిందని నవీన్ అన్నారు.

గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానిని క‌లుసుకున్న‌ట్లు గుర్తుచేసుకున్న నవీన్.. ప్రజల భావోద్వేగాలతో కనెక్ట్ అవ్వడం ద్వారా నిజమైన గొప్పతనం వస్తుందని తాను తెలుసుకున్నానని చెప్పారు. ఆ సమయంలో నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సద్భావనా ​​మిషన్ కార్యక్రమంలో మీరు ప్రతి ఒక్కరి మాట‌ వినడం చూశాను. కార్యక్రమం ముగిసిన తర్వాత.. మీ గ్రీన్‌రూమ్‌లో మీరు మాతో మాట్లాడినప్పుడు గుజరాత్ నుండి ఇంత మంది ఎందుకు వచ్చారో మీరు చాలా భావోద్వేగంతో వివరించారు.. ఆ రోజు ప్రజల భావోద్వేగాలతో తనను తాను కనెక్ట్ చేసుకున్న వ్యక్తి గొప్పవాడని నాకు అర్థమైందని వేదిక‌పై ఉన్న ప్ర‌ధానితో చెప్పారు.

తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై నవీన్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల కృషి, అంకితభావం ఐదు రాష్ట్రాల్లోనూ విజయపథంలో దూసుకుపోతామ‌న్నారు. తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఈ రాష్ట్రాల జనాభాపై విస్తృతంగా చర్చ జరుగుతుందన్నారు. జనాభా మార్పు అక్కడి పరిస్థితిని మారుస్తోంది. అది మనకు సవాలుగా నిలుస్తోంది. అయితే కార్యకర్తలు తమ పోరాటం, కృషితో మొత్తం ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి విజయాన్ని అందిస్తారనే నమ్మకం మాకు ఉందన్నారు.

Next Story