భారతీయులకు ఇంకా మాస్క్ అవసరం ఎప్పటి వరకూ ఉందంటే..!
Niti Aayog Member VK Paul. చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గినా.. డబుల్ డోస్ వ్యాక్సిన్లు వేసుకున్నా మాస్కులు
By M.S.R Published on 14 Sept 2021 7:16 PM ISTచాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గినా.. డబుల్ డోస్ వ్యాక్సిన్లు వేసుకున్నా మాస్కులు అవసరం లేదని ఆయా దేశాల ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి. అలాంటి సమయం భారత్ లో ఎప్పుడు వస్తుందా అని భారతీయులు ఎదురుచూస్తూ ఉన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ భారత్ లో మాస్కులు ఎప్పటి వరకూ తప్పకుండా పెట్టుకోవాలో తెలిపారు. 2022 వరకూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందేనని.. దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడంతో థర్డ్‌వేవ్ ముప్పు ముంగిట్లో ఉన్నామని ఆయన అన్నారు. వ్యాక్సిన్లు, అత్యవసర మందులు, కఠిన ఆంక్షలతోనే కరోనాను కట్టడి చేయగలమని అన్నారు. ఇప్పుడే ప్రజలు రిలాక్స్ కావద్దని, అది ముప్పును మరింత పెంచుతుందని హెచ్చరించారు. ఇప్పటికే పండుగల సందర్భంగా భారీగా ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
ఇక భారత్ కూడా వ్యాక్సినేషన్ లో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 13 నాటికి భారత్ లో 75కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేయడం జరిగింది. సోమవారానికి భారత్‌లో మొత్తం 75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్, గోవా, దాద్రా నగర్ హవేలి, లడక్, లక్షద్వీప్ – వయోజన ప్రజలందరూ కనీసం ఒక మోతాదు టీకాను తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పూర్తిగా జరిగితే మాస్కుల నుండి భారత్ లో విముక్తి కలిగే అవకాశం లేకపోలేదని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు.