105 గంటల్లో 75 కి.మీ రోడ్డు.. NHAI ప్రపంచ రికార్డ్‌

NHAI creates world record by constructing 75 km long highway in just 105 hours.ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా రోడ్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2022 9:29 AM IST
105 గంటల్లో 75 కి.మీ రోడ్డు.. NHAI ప్రపంచ రికార్డ్‌

ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా రోడ్లు ఎక్కడ నిర్మిస్తారని ఎవరైనా అడిగితే ఇక ఏ మాత్రం తుడుము కోకుండా భార‌తదేశం అని చెప్ప‌వ‌చ్చు. నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా (NHAI) స‌రికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఒకే వ‌రుస‌లో ఏక‌ధాటిగా 75 కిలోమీట‌ర్ల పొడ‌వైన రోడ్డు నిర్మాణాన్నికేవ‌లం నాలుగున్న‌ర‌ రోజుల్లోనే పూర్తి చేసింది. త‌ద్వారా ఖ‌తార్‌పేరుతో ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది. ఈ విష‌యాన్నికేంద్రరోడ్డు రవాణా, నేషనల్ హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్ల‌డించారు. ఈ మేర‌కు గిన్నిస్ రికార్డ్ స‌ర్టిఫికెట్‌, రోడ్డు నిర్మాణ ఫోటోల‌ను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఇంతకీ ఈ రోడ్డు ఎక్కడ వేశారో తెలుసా?

మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి నుంచి అకోలా వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారి 53పై రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ఎన్‌హెచ్ఏఐ చేప‌ట్టింది. గ‌త శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల‌కు ప‌నుల‌ను ప్రారంభించి మంగ‌ళ‌వారం పూర్తి చేసింది. మొత్తం 75 కిలోమీట‌ర్ల పొడ‌వైన రోడ్డును కేవ‌లం 105 గంట‌ల 33 నిమిషాల్లో పూర్తి చేసింది. దీంతో అతి త‌క్కువ స‌మ‌యంలో 75కిలోమీట‌ర్ల రోడ్డు పూర్తిచేసి గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది. గిన్నిస్ సంస్థ ఇందుకు సంబంధించిన స‌ర్టిఫికెట్‌ను కూడా అందజేసింది.

Next Story