వచ్చే ఏడాది కోవిడ్‌ వ్యాక్సిన్‌: కేంద్ర మంత్రి

Next Year Covid Vaccine .. వచ్చే ఏడాది దేశ ప్రజలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ

By సుభాష్  Published on  30 Nov 2020 6:16 PM IST
వచ్చే ఏడాది కోవిడ్‌ వ్యాక్సిన్‌: కేంద్ర మంత్రి

వచ్చే ఏడాది దేశ ప్రజలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూలై లేదా ఆగస్టు కల్లా సుమారు 25 నుంచి 30 కోట్ల మంది భారతీయులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించగలమని వెల్లడించారు. అయితే ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కోవిడ్‌ ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

కాగా, హైదరాబాద్‌లోభారత్‌ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారీ, పురోగతిపై శనివారం ప్రధాని నరేంద్రమోదీ వచ్చి పరిశీలించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌కు తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలను మోదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుణెలో సీరం ఇస్టిట్యూట్‌లో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఇలా మోదీ పర్యటతో ప్రజల్లో మరింత నమ్మకం కలిగింది. తొందరలోనే భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతోంది. అయితే ప్రభుత్వం - ప్రైవేటు భాగస్వామ్యంతో ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Next Story