నెలన్నర క్రితమే పెళ్లి.. 4 నెల‌ల గ‌ర్భ‌వ‌తి.. వ‌రుడు షాక్‌..!

Newlywed Bride found 4 month Pregnant in UP.పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో అంద‌మైన క్ష‌ణం. పెళ్లి త‌రువాత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2022 10:15 AM IST
నెలన్నర క్రితమే పెళ్లి.. 4 నెల‌ల గ‌ర్భ‌వ‌తి.. వ‌రుడు షాక్‌..!

పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో అంద‌మైన క్ష‌ణం. పెళ్లి త‌రువాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంది ఆ జంట‌. ఒక‌రి క‌ష్టాల‌ను మ‌రొక‌రు పంచుకుంటూ ముందుకు వెలుతుంటారు. అయితే.. ఎన్నో ఆశ‌ల‌తో పెళ్లి చేసుకున్న ఆ యువ‌కుడికి వివాహ‌మైన నెల‌న్న‌ర రోజుల‌కే ఊహించ‌ని షాక్ త‌గిలింది. అత‌డి భార్య నాలుగు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని తెలిసింది. దీంతో ఆ యువ‌కుడితో పాటు అత‌డి కుటుంబ స‌భ్యులు ఖంగుతిన్నారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌హారాజ్ గంజ్‌కు చెందిన యువ‌కుడికి పొరుగు గ్రామానికి చెందిన ఓ యువ‌తితో నెల‌న్న‌ర రోజుల కింద‌ట వివాహమైంది. పెళ్లి తంతు ముగిసి ఇద్ద‌రూ ఇప్పుడే కొత్త ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టారు. అయితే.. రెండు మూడు రోజులుగా న‌వ వ‌ధువు క‌డుపు నొప్పిగా ఉంది అని చెబుతుండ‌డంతో.. భ‌ర్త‌, అత్త‌మామ‌లు ఆమెను ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు.

ఆమెను ప‌రీక్షించిన వైద్యులు చెప్పిన విష‌యం విని వారు ఒక్క‌సారిగా షాక్ కు గురైయ్యారు. ఆమె నాలుగు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని వైద్యుడు చెప్పాడు. దీంతో వారు తీవ్ర ఆగ్ర‌హానికి లోన‌య్యారు. ఆమెను ఇంటికి తీసుకువెళ్లేందుకు నిరాక‌రించారు. పెళ్లైన నెల‌న్న‌ర రోజుల‌కే నాలుగు నెల‌ల గ‌ర్భం ఎలా వ‌స్తుంద‌ని, తాము మోస‌పోయామ‌ని స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అమ్మాయి తల్లిదండ్రులు తమను మోసం చేశారని.. గర్భం గురించి ముందే తెలిసినప్పటికీ వివాహం జరిపించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story