ఎన్డీఏ కూటమితో బంధాన్ని తెంచుకున్న జేడీయూ.. తన పాత మిత్రులతో కలిసి బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే బిహార్ సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ తాజాగా కేబినెట్ విస్తరణ జరిగింది. జేడియూతో కూడిన కూటమిలో 36మందికి మంత్రి పదవులు దక్కాయి. కూటమిలో అత్యధిక సభ్యులు ఉన్న ఆర్జేడీకి 16 మంత్రి పదవులు దక్కగా, జేడీయూ 11 మంత్రి పదవులు కేటాయించారు. ఇవాళ 31 మంది సభ్యులు ఇవాళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన మంత్రుల చేత గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఉన్నారు. బిహార్ కేబినెట్‌లో మొత్తం 36 మంత్రి పదవులు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ పదవులు ఇచ్చారు. కాగా ఎన్డీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత 8వ సారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం జేడీయూ కూటమి బలం 164గా ఉంది.