పెళ్లిమండ‌పం నుంచి జంట‌గా పారిపోయిన వ‌ధువు-వ‌రుడు

New couple runway from Wedding hall in Odisha.వివాహా ముహుర్త స‌మ‌యానికి పెళ్లి కూతురు క‌నిపించ‌డం లేద‌నో, పెళ్లి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2021 2:23 AM GMT
పెళ్లిమండ‌పం నుంచి జంట‌గా పారిపోయిన వ‌ధువు-వ‌రుడు

వివాహా ముహుర్త స‌మ‌యానికి పెళ్లి కూతురు క‌నిపించ‌డం లేద‌నో, పెళ్లి కుమారుడు పారిపోయిన ఘ‌ట‌న‌లను మ‌నం చాలా సార్లు చూశాం. అయితే.. అదేదో సినిమాలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో క‌లిసి జంట‌గా పారిపోతారు. పెళ్లి అనే భయంతోనే వీరు అలా పారిపోతారు. ఆ విషయం మండపంలో పెద్దలకు తెలియకుండా.. వారి ఫ్రెండ్స్ తెల్లవారే వరకు మ్యానేజ్ చేయగా వాళ్లే తిరిగి తెల్లవారేసరికి ప్రేమలో పడి మండపానికి చేరుకొని పెళ్లి చేసుకుంటారు. అచ్చంగా అలాంటి సంఘ‌ట‌న కాక‌పోయినా.. కొంచెం ఇలాగే జ‌రిగింది. ఓ వివాహ మండ‌పంలో పెళ్లికుమారై, కుమారుడు ఇద్ద‌రూ క‌లిసి పారిపోయారు. ముహుర్తానికి ముందే క‌నిపించ‌కుండా పోయినా ఈ జంట ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డ ఉన్నారో ఎవ‌రికి తెలీదు. ఈఘ‌ట‌న ఒడిశాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. బాలాసోర్ జిల్లాలోని చాపులియా చౌక్‌లో ఓ వివాహ మండ‌పంలో పెళ్లి జరుగుతుంది. మ‌రికొద్దిసేప‌ట్లో పెళ్లి కుమారుడు పెళ్లి కుమారై మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నాడు. అంత‌లో అక్క‌డికి పోలీసులు వ‌చ్చారు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా పెళ్లిళ్లు, ఫంక్ష‌లల్లో క‌చ్చితంగా నిబంధ‌న‌లు పాటించాల్సిందే. ఇక ఒడిశాలో పెళ్లికి యాభై మందికి మించి హాజ‌రు కాకుడ‌ద‌నే నిబంధ‌న ఉంది. దీనిని క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. అయితే.. ఆ పెళ్లికి 200 మంది దాకా అతిథులు వ‌చ్చారు. దీంతో పోలీసులు అక్క‌డ హ‌డావుడి చేశారు. పోలీసులు ప్ర‌శ్న‌ల‌తో హింసిస్తార‌నీ, కేసు న‌మోదు చేస్తార‌నే భ‌యంతో ఆ పెళ్లికొడుకు, పెళ్లికూతురు జంట‌గా క‌లిసి మండ‌పం నుంచి పారిపోయారు. వారిద్ద‌రు పారిపోయి రెండు రోజులు దాటిన‌ప్ప‌టికి ఎక్క‌డ ఉన్నార‌నే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ కూడా తెలియ‌పోవ‌డం విశేషం.

Next Story
Share it