తొలి తెలుగు సినిమా మొదలుపెట్టేసిన నజ్రియా
Nazriya Nazim Fahadh joins the shoot of Nani co-starrer. నజ్రియా నజీమ్.. ఆమెకు నాని సినిమాలో ఆఫర్ దక్కడంతో అందుకు ఒప్పేసుకుంది.
By Medi Samrat Published on 19 April 2021 12:04 PM ISTనజ్రియా నజీమ్.. రాజా-రాణి సినిమాతో దక్షిణాదిన ఒకప్పుడే మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకుంది. అప్పట్లో ఆమెను తెలుగు సినిమాల్లో నటింపజేయడానికి కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు కానీ అది వీలు పడలేదు. ఆ తర్వాత ఆమె మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ను పెళ్లి చేసుకుని.. చిత్ర పరిశ్రమకు దూరమైంది. 'కూడె' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. తన భర్తతో ట్రాన్స్ సినిమాలో కూడా నటించింది. ఇప్పుడు ఆమెకు నాని సినిమాలో ఆఫర్ దక్కడంతో ఆమె అందుకు ఒప్పేసుకుంది. నజ్రియాను తెలుగులో ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూసిన అభిమానులకు ఆమె గుడ్ నెస్ చెప్పింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా వస్తోన్న 'అంటే సుందరానికీ' అనే మూవీలో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈరోజు నుండే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఆ విషయాన్ని నజ్రియా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది.
'అందరికీ నమస్కారం. ఈరోజు నా ఫస్ట్ తెలుగు మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాను. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే.'అంటే సుందరానికి'...నాకు ఎప్పటికీ ప్రత్యేకమే' అంటూ తన షేర్ చేసుకుంది. నజ్రియా తన భర్త ఫహద్ తో కలిసి హైదరాబాద్ కు వచ్చింది. ఫహద్ కూడా మలయాళంలో స్టార్ గా వెలుగొందుతూ ఉన్నాడు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప' సినిమాలో విలన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఫహద్ తెలుగు వాళ్లకు కూడా దగ్గర కాబోతూ ఉన్నారు. ఈ క్రేజీ కపుల్ తెలుగులో నటిస్తూ ఉండడంతో సినీ అభిమానులు ఎంతో ఆనంద పడుతూ ఉన్నారు.