హర్యానాకు చెందిన నాయబ్ సర్కార్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు పంచకులలోని దసరా మైదానంలో జరగనుంది. హర్యానా ముఖ్యమంత్రిగా నయీబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాయబ్ సైనీతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారానికి నగరమంతటా స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీతో ప్రమాణం చేయిస్తారు. నాయబ్ సైనీతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు మంత్రులుగా ప్రమాణం చేయాలనే పిలుపు ఇప్పటికే అందింది. కొత్త ఎమ్మెల్యేలలో కృష్ణ పన్వార్, గౌరవ్ గౌతమ్, అనిల్ విజ్, మహిపాల్ దండా, శృతి చౌదరి, విపుల్ గోయల్, రావు నర్బీర్, కృష్ణ బేడీ, ఆర్తీ రావు, శ్యామ్ సింగ్ రాణా, డాక్టర్ అరవింద్ శర్మ, రాజేష్ నగర్‌లు మంత్రులు కావడం దాదాపు ఖాయం అని తెలుస్తోంది.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి 11 గంటలకు చంఢీఘర్ చేరుకుంటారు. 12 గంటల నుంచి 2 గంటల మధ్య పంచకుల, సెక్టార్ 5లోని దసరా గ్రౌండ్ కు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిర్వహించే మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.