వావ్.. మహారాష్ట్ర రైతు ఘనత.. పసుపు, గులాబీ రంగులలో కాలీఫ్లవర్స్‌!

Nashik farmer cultivates high-nutrient, purple and yellow cauliflower. మహారాష్ట్ర రైతు ఘనత.. పసుపు, గులాబీ రంగులలో కాలీఫ్లవర్స్

By Medi Samrat
Published on : 15 Feb 2021 3:37 PM IST

Nashik farmer cultivates high-nutrient, purple and yellow cauliflower

మనం మార్కెట్ లోకి వెళ్లితే తెల్లగా నిగ నిగలాడుతూ కనించే కాలీ ఫ్లవర్ తెల్లగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కొన్ని కాలీఫ్లవర్లు ఆకుపచ్చని రంగులో ఉంటాయి. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు మాత్రం దీనికి భిన్నంగా పుసుపు, గులాబీ రంగులలో వాటిని పండించాడు. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని దభారీ గ్రామానికి చెందిన మహీంద్ర నికమ్ అనే రైతు తన చెన్లో పసుపు, గులాబీ రంగుల్లో హైబ్రీడ్ కాలీఫ్లవర్లను పండించాడు. ఈ సందర్భంగా మహీంద్ర నికమ్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్ కంపెనీ సింజెంటా అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారికి చెందిన భూమిలో రూ.రెండు నెలల కిందట కాలీఫ్లవర్ విత్తనాలను రూ.40 వేలకు కొన్నాను. 30 గుంటలలో ఆ విత్తానాలు వేసాను.


పసుపు, గులాబీ రంగుల్లో కాలీఫ్లవర్స్ పండాయి. వీటిని పండించడానికి నాకు ఎలాంటి ఖర్చు కాలేదు అంతే కాదు వాటిలో పోషకాలు కూడా చక్కగా ఉన్నాయని వివరించారు. అంతే కాదు వీటిని మెట్రో నగరాల నుంచి అధిక డిమాండ్ వస్తుంది అని తెలిపారు. ఇక ఆంథోసైనిన్స్ కంటెంట్ హైబ్రిడ్ కాలీఫ్లవర్‌కు యాంటీ బాక్టీరియల్, క్యాన్సర్ నిరోధించడంలో ఇది తోడ్పడుతుంది. సాధారణ సాంప్రదాయ కాలీఫ్లవర్‌తో పోలిస్తే వీటిలో విటమిన్ 'ఎ' ఎక్కువగా ఉంటుంది.

వీటికి అయ్యే ఖర్చు రెండు లక్షలు కాగా.. ఈ రంగుల కాలీఫ్లవర్లను అమ్మితే దాదాపు రూ.16 లక్షలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇక మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాజీ బుస్ దాకా వెళ్లింది. దాదాజీ మాట్లాడుతూ… తెల్లకాలీ ఫ్లవర్ కన్నా ఇలాంటి రంగు కాలీ ఫ్లవర్ కి మంచి డిమాండ్ ఉందని.. ది పసుపు, గులాబీ లేదా గులాబీ కలర్‌లో పెరిగిందని అన్నారు.




Next Story