రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. త‌రువాత ఏం జ‌రిగిందంటే

Narrow escape for Indore woman after she falls while boarding moving train.క‌దులుతున్న రైలులో ఎక్క‌డం ప్ర‌మాదక‌రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Aug 2021 9:28 AM IST
రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. త‌రువాత ఏం జ‌రిగిందంటే

క‌దులుతున్న రైలులో ఎక్క‌డం ప్ర‌మాదక‌రం అని తెలిసినా.. చాలా మంది దీనిని ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌మ్య‌స్థానానికి తొంద‌ర‌గా వెళ్లాలనే తొంద‌ర‌లో క‌దులుతున్న రైలులోకి ఎక్కేస్తున్నారు. ఈ స‌మ‌యంలో కొంద‌రు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. అయిన‌ప్ప‌టికి వీరిలో మార్పు రావ‌డం లేదు. తాజాగా ఓ మ‌హిళా ప్ర‌యాణీకురాలు క‌దులుతున్న రైలు ఎక్కేందుకు య‌త్నించింది. దీంతో ఆమె రైలు, ఫ్లాట్‌ఫాం మ‌ధ్య‌లో ఇరుక్కుపోయింది. ప‌క్క‌నే ఉన్న మిగ‌తా ప్ర‌యాణికులు అప్ర‌మ‌త్త‌మై ఆమెను ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న ఇండోర్ రైల్వే స్టేష‌న్‌లో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

రైల్వే పీఆర్‌ఓ ఖేమ్‌ రాజ్‌మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మ‌హిత‌, మ‌రో వ్య‌క్తి ఓ చిన్నారి రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చారు. వారు ప్లాట్‌ఫాం మీద‌కు వ‌చ్చే స‌రికి రైలు క‌దులుతోంది. మొద‌ట ల‌గేజీ రైలులో పెట్టిన త‌రువాత చిన్నారితో క‌లిసి ఆ వ్య‌క్తి రైలులోకి ఎక్కాడు. ఆ త‌రువాత మ‌హిళ కూడా క‌దులుతున్న రైలు ఎక్కేందుకు య‌త్నించింది. అయితే.. ఆమె జారిప‌డి ఫాట్ ఫాం, రైలు మ‌ధ్య‌లో ఇరుక్కుపోయింది. వెంట‌నే ప‌క్క‌న ప్ర‌యాణీకులు ఆమెను ర‌క్షించారు. ఈలోపు రైలులోకి ప్ర‌యాణీకులు చైన్ లాగ‌డంతో రైలు నిలిచిపోయింది. దీంతో మ‌హిళ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డింద‌ని తెలిపారు.

Next Story