మంగళగిరి ఎయిమ్స్ డ్రోన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. దిల్లీలోని ఏఐఐఏ నుంచి వర్చువల్ గా నరేంద్ర మోదీ ఈ సేవలను ఆవిష్కరించారు. ఎయిమ్స్ అధికారులు ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష నిర్వహించారు. ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్సీ వరకూ డ్రోన్ను పంపించారు. ఓ మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి ఎయిమ్స్ కు అది తిరిగి వచ్చింది. ఎయిమ్స్ నుంచి ఈ పీహెచ్సీ దాదాపు 12 కి.మీ దూరంలో ఉంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్ల ఉపయోగంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేద ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద ఇనిస్టిట్యూట్ లో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొనగా.. వర్చువల్ గా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జూమ్ ద్వారా సీఎం చంద్రబాబు, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులు హాజరయ్యారు.