ఆ ఏటీఎంలో రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 వ‌చ్చాయి.. ఎగ‌బ‌డిన జ‌నం

Nagpur ATM machine dispenses 5 fold cash.ఏటీఎం నుంచి రూ.500 డ‌బ్బులు విత్ డ్రా చేయడానికి వెళ్లిన వ్యక్తికి.. ఏకంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 1:20 PM IST
ఆ ఏటీఎంలో రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 వ‌చ్చాయి.. ఎగ‌బ‌డిన జ‌నం

ఏటీఎం నుంచి రూ.500 డ‌బ్బులు విత్ డ్రా చేయడానికి వెళ్లిన వ్యక్తికి.. ఏకంగా రూ.2,500 వ‌చ్చాయి. బ్యాంకు ఖాతా నుంచి మాత్రం రూ.500 దీంతో మాత్ర‌మే క‌ట్ అయ్యాయి. దీంతో మ‌ళ్లీ రూ.500 విత్ డ్రా చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా, మ‌ళ్లీ అత‌డికి ఏంటీఎం నుంచి రూ.2,500 వ‌చ్చాయి. విత్ డ్రా చేయాల‌నుకుంటోన్న దాని కంటే ఐదు రెట్టు అధికంగా డ‌బ్బు వ‌స్తుంద‌న్న విష‌యం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్క‌డ‌కు చేరుకున్నారు. ఆ ఏటీఎం నుంచి డ‌బ్బు డ్రా చేసుకోవ‌డానికి పోటీ ప‌డ్డారు. మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని ఖాపెర్ఖెడా న‌గ‌రంలో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి ఈ విష‌యంపై స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని, ఏటీఎంను మూసి వేశారు.

నాగ్‌పూర్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖపర్‌ఖేడా పట్టణంలోని ఒక ప్రైవేట్ బ్యాంక్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM) వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఎటిఎం సెంటర్‌ బయట పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా అదనంగా నగదు సరఫరా అయినట్లు తెలుస్తోంది. రూ.100 నోట్లను పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన ఏటీఎం ట్రేలో రూ.500 కరెన్సీ నోట్లను తప్పుగా ఉంచినట్లు అధికారి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు.

Next Story