నేను సోషల్ మీడియాలో అతనిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాను - ప్రధాని మోదీ

Nagaland minister tweets video of PM Modi praising him. నాగాలాండ్ బీజేపీ చీఫ్ టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్‌ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు

By M.S.R  Published on  24 Feb 2023 6:23 PM IST
నేను సోషల్ మీడియాలో అతనిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాను - ప్రధాని మోదీ

నాగాలాండ్ బీజేపీ చీఫ్ టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్‌ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. గతంలో ఆయన చేసిన పలు ట్వీట్లు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ మరోసారి వైరల్ అవుతోంది. “గురూజీ నే బోల్ దియా! బస్ హమ్ తో ధన్యా హో గయే!” అంటూ మోదీని గురూజీగా అభివర్ణించడం విశేషం.

టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్‌ షేర్ చేసిన 32 సెకన్ల వీడియో క్లిప్‌లో, ప్రధాని మోదీ మాట్లాడుతూ “నాగాలాండ్‌ బీజేపీ అధ్యక్షుడు టెమ్‌జెన్ ఇమ్నా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలందరకూ తెలుసు. అతను తన వీడియోలలో చెప్పేదాన్ని ప్రజలు ఆనందిస్తారు. అతను సోషల్ మీడియాలో నాగాలాండ్, ఈశాన్య రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నేను సోషల్ మీడియాలో అతనిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాను." అని చెప్పుకొచ్చారు.


Next Story