గోల్డ్ లోన్ సంస్థ‌.. ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు మత్తయ్య జార్జ్ ముత్తూట్. ముత్తూట్ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన వ్యాపారవేత్త. ఆయన సారథ్యంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ దేశంలోనే గోల్డ్‌లోన్‌ ఇచ్చే అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందింది. కేరళలోని కొచ్చి ప్రధాన కార్యాలయంగా ముత్తూట్‌ కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. దేశవ్యాప్తంగా ముత్తూట్ ఫైనాన్స్‌కు పలు శాఖలు ఉన్నాయి. లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇదిలావుంటే.. ఫోర్బ్స్ ఆసియా మేగజైన్ 2011లో ప్ర‌క‌టించిన దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఎంజీ జార్జ్ 50వ స్థానంలో ఉన్నారు. ఆపై 2019 లో 44వ స్థానానికి ఎగ‌బాకారు.


సామ్రాట్

Next Story