కరోనా ఎఫెక్ట్.. ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు.. శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని

Muslims prayers at house.రంజాన్ ప‌ర్వ‌దినాన్ని ముస్లిం సోద‌రులు ఇంట్లోనే ఉంటూ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2021 5:36 AM GMT
ramzan

రంజాన్ ప‌ర్వ‌దినాన్ని ముస్లిం సోద‌రులు ఎంతో భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో జ‌రుపుకొంటున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఇంట్లోనే ఉంటూ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ప‌లు ప్రాంతాల్లో మ‌సీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ.. ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌డంతో క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. సాధారణంగా రంజాన్ వేళ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముస్లింలందరూ ఒకే దగ్గరికి చేరి సామూహికంగా ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే, కరోనా భయం ఈసారి అందరికీ ఒక దగ్గరకు చేర్చలేకపోయింది. దీనికి తోడు ఆంక్షలు ఉండనే ఉన్నాయి.

ఈద్‌ -ఉల్‌- ఫితర్ సంద‌ర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖః సంతోషాలు, ఆరోగ్యంతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు. సమష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని పెంచే దిశగా పాటుపడాలని ప్రజలకు సూచించారు. 'ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరి ఆరోగ్యం బాగుండాలని, కలికట్టుగా అందరం మహమ్మారిని జయించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా'.. ఈద్‌ ముబారక్‌ అంటూ ట్వీట్‌ చేశారు.


Next Story