వినికిడి, మాట్లాడే బలహీనత ఉన్న ముస్లిం తండ్రీకొడుకులు కొన్ని సంవత్సరాలుగా శివాలయాన్ని చూసుకుంటున్నారు. శ్రీనగర్‌లోని ఓ లోయలో ఉన్న ఆలయానికి సంరక్షులకుగా ఉంటూ.. వారు మత సామరస్యానికి ఉదాహరణగా నిలిచారు. తండ్రి అహ్మద్ అలై శ్రీనగర్‌లోని జబర్వాన్ హిల్స్‌లోని చిన్న శివాలయం అయిన గోపి తిరిత్ ఆలయానికి సంరక్షకులుగా ఉన్నారు. నిసార్ అహ్మద్ అలై, అతని తండ్రి ఆరేళ్లకు పైగా ఆలయ సంరక్షణను చూస్తున్నారు. నిసార్ ఆలయ ప్రాంగణంలో ఆవరణను శుభ్రం చేయడం, తోటల నిర్వహణ, కూరగాయలు పండించడం వంటి పనులు చేస్తుంటారు. ఈ ఆలయం కాశ్మీర్ యొక్క పరస్పర సోదరభావానికి చిహ్నంగా స్థానికులు నమ్ముతారు.
స్థానిక నివాసి ఫిర్దౌస్ మాట్లాడుతూ.. "వారు చాలా కాలంగా ఆలయంలో కేర్‌టేకర్‌లుగా పనిచేస్తున్నారు. దాని నిర్వహణకు బాధ్యత వహిస్తారు. ఇది కశ్మీర్ సోదరభావానికి చిహ్నం, ఇది ప్రతి పౌరుడి నైతిక బాధ్యత. "ఒకవేళ తండ్రీకొడుకులు చూసుకోలేకపోతే ఇతర వ్యక్తులు కూడా ఆలయాన్ని చూసుకుంటూ ఉంటారు" అని అతను చెప్పాడు. మరో స్థానిక నివాసి ఉమర్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లో ముస్లిం సమాజం హిందూ దేవాలయాలను సంరక్షిస్తున్నట్లు చాలా ఉదాహరణలు ఉన్నాయి. "ఈ శివాలయాన్ని మా ముస్లిం కమ్యూనిటీ అబ్బాయి చూసుకుంటున్నాడు. ఇది ప్రత్యేకమైన సందర్భం కాదు, ముస్లిం సమాజం హిందూ దేవాలయాలను చూసుకునే లోయలో చాలా దేవాలయాలు ఉన్నాయి. అన్ని మతాలు ఇక్కడ సామరస్యంగా జీవిస్తాయి. ఒకరి మతాన్ని గౌరవించుకుంటాయి."అని ఉమర్ అన్నారు.