ముంబైలో భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  8 July 2024 4:45 AM GMT
Mumbai, heavy rains, schools, colleges, closed ,

ముంబైలో భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. నగరంలోని రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి. నదులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా ముంబై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటిలో ప్రయాణం ముందకు సాగడం లేదు. సోమవారం తెల్లవారజాము నుంచే వర్షాలు భారీగా పడుతున్నాయి. దాంతో.. భారీ వర్షంతో నగరం మునిగిపోయింది. పలు ప్రాంతాల్లో కార్లు ,బైకులు నీళ్లలో మునిగిపోయాయి.

ముంబైలో ఉదయం 7 గంటల ప్రాంతంలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అంధేరి, కుర్లా, భందూప్ర, కింగ్స్‌ సర్కిల్, దాదర్‌తో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయని అధికారులు వెల్లడించారు. భారీ వర్షానికి డ్రెయినేజీలు ఉప్పొంగుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పట్టాలపైన కూడా పెద్ద స్థాయిలో నీరు నిలిచపోయింది. ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదనీరు పట్టాలపై ప్రవహిస్తుండటంతో సబర్బన్‌ రైల్‌ సర్వీసులను రద్దు చేసినట్లు చెప్పారు. తాత్కాలికంగా ఈ రద్దు కొనసాగుతుంది చెప్పారు. అలాగే ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా అధికారులు నిలిపివేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ముంబైలోని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు, కాలేజ్‌లకు మున్సిపల్ కార్పొరేషన్ హాలీడేగా ప్రకటించింది.

ముంబై మాత్రమే కాదు.. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే అందుబాటులో ఉండేలా సిబ్బంది సిద్ధం అయ్యారు. థానే, వాసయ్‌, రాయ్‌గఢ్‌, చిప్లున్‌, కొల్హాపూర్‌, సాంగ్లి, సతారా ఘట్కోపర్‌, కుర్లా, సింధుదుర్గ్‌ ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రకటించింది.

Next Story