అంబానీ గ్యారేజీలో కొత్త కార్లు.. ధర ఎంతో తెలుసా.?

Mukesh Ambani got his Rs 7 Crore Rolls-Royce Cullinan Black Badge. రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ కార్ల గ్యారేజీలోకి కొత్త వచ్చి చేరాయి.

By Medi Samrat
Published on : 7 March 2021 2:14 PM IST

Mukesh Ambani got his Rs 7 Crore Rolls-Royce Cullinan Black Badge.

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ కార్ల గ్యారేజీలోకి కొత్త కార్లు వచ్చి చేరాయి. 2021 ఆరంభంలోనే మూడు అత్యంత విలాసవంతమైన ఎస్‌యూవీలు డెలివరీ అయ్యాయి. తాజాగా భారత్‌లో అత్యంత ఖరీదైన కారు రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌ కూడా అంబానీ కార్లలో ఒకటైపోయింది. విలాసంతో పాటు అత్యంత భద్రత ఈ కారుకున్న ప్రత్యేకత. 2018లో భారత్‌కు తీసుకువచ్చిన రోల్స్‌ రాయిస్‌ కల్లినన్‌కు మరిన్ని అధునాతనమైన, టెక్నాలజీని జోడించి కల్లినన్‌ బ్లాక్‌ బ్యాడ్జ్‌గా తీసుకువచ్చారు.

అయితే దీనిని 2020లో విడుదల చేశారు. రెండు కల్లినన్‌ మోడళ్లను సొంతం చేసుకున్న తొలి భారతీయుడు ముకేష్‌ అంబానీ అని తెలుస్తోంది. బ్లాక్‌ బ్యాడ్జ్‌ ఎడిషన్‌ ధర రూ.8.20 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఇక దీనిని రోడ్డుపైకి తీసుకురావాలంటే మొత్తం 10 కోట్లపైగానే ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం. ఇక కలర్‌, ఇంటీరియర్స్‌ మన అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దాలంటే మరింత ఖర్చు పెట్టుకోవాల్సిందే. సాధారణంగా ముకేశ్‌ అంబానీ ఆయన కార్లలో చాలా మార్పులు చేయించుకుంటుంటారు.

కారు ఫీచర్స్‌ :

ఈ కారు ఫీచర్స్‌ విషయానికొస్తే.. 6.75 లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్-టర్బో వీ12 ఇంజన్ తో ఉంటుంది. బేసిక్‌ కల్లినన్‌తో పోల్చితే ఈ కారు మరింత శక్తిమంతమైంది. గరిష్ఠంగా 592 హెచ్‌పీ శక్తిని, 900 ఎన్‌ఎమ్‌ టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ కారు 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. అంతేకాదు.. ఈ కారు గంటకు 100 కి.మీ వేగాన్ని 4.5 సెకన్లలోనే అందుకునే కెపాసిటీ కలదు. ఎడారి, అడవి, బురద, కొండ ప్రాంతం ఇలా ఎలాంటి ప్రాంతంలోనైనా దూసుకుపోయేలా దీనిని తయారు చేశారు. ఇక కారు ఇంటిరియర్స్‌లోని పైభాగాన్ని నక్షత్రాల్ని తలపించే ప్రత్యేక డిజైనింగ్‌ ఆకట్టుకుంటుంది.

బ్లాక్‌బ్యాడ్జ్‌తో పాటు రోల్స్‌ రాయిస్‌కు చెందిన ఫాంటమ్‌ VIII, ఫాంటమ్‌ డీహెచ్‌సీ వంటి అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లు అంబానీ గ్యారేజ్‌లో ఉన్నాయి. వీటితో పాటు బెంట్లీ బెంటెగా, మసెరటి లెవంటి కార్లు కూడా ఈ ఏడాదే అంబానీ ఇంట్లో చేరాయి. వీటన్నింటినీ ఆయన 2020లో ఆర్డర్‌ చేయగా.. ఇప్పుడు డెలివరీ అయినట్లు సమాచారం. ఈ కారుకు అన్ని ప్రత్యేకతలే. ఇక వీటితో పాటు బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారీ 812, మెక్‌లారెన్‌ 520ఎస్‌ స్పైడర్‌, లాంబోర్గినీ అవెంటడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌, ఫెరారీ 488 జీటీబీ, ఫెరారీ పోర్టోఫినో, యాస్టన్‌ మార్టిన్‌ డీబీ11 వంటి సూపర్‌ కార్లు ముకేశ్‌ అంబానీ కుటుంబం వాడే కార్లలో కొన్ని ఉన్నాయి.




Next Story