జార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభం.. ధోని భార్య గ‌రంగ‌రం

MS Dhoni’s wife raise voice against power crisis in Jharkhand state.టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని భార్య సాక్షి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 April 2022 6:46 AM GMT
జార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభం.. ధోని భార్య గ‌రంగ‌రం

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని భార్య సాక్షి సింగ్ జార్ఖండ్ ప్ర‌భుత్వం పై సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించింది. ప్ర‌స్తుతం సాక్షి సింగ్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. జార్ఖండ్‌లోని విద్యుత్ సంక్షోభంపైన‌ ఆమె ప్ర‌శ్నించింది. ప్ర‌భుత్వానికి ప‌న్ను క‌డుతున్న ఓ వ్య‌క్తిగా తాను ఈ ప్ర‌శ్న అడుగుతున్నాను. జార్ఖండ్ ఇన్ని సంవ‌త్స‌రాలుగా విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది అని ప్ర‌శ్నించింది. విద్యుత్‌ను ఆదా చేయడం కోసం మా వంతు కృషి చేస్తూనే ఉన్నాము. అయిన‌ప్ప‌టి ఇంకా ఇలా ఎందుకు అని ట్వీట్ చేసింది.

'ఓ టాక్స్‌ పేయర్‌గా జార్ఖండ్‌ ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నా. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఇంతలా ఎందుకుందనేది తెలుసుకోవాలనుకుంటున్నా. ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మా తరపు నుంచి విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా సమస్య ఒక కొలిక్కి రావడం లేదు' అని సాక్షి సింగ్ ట్వీట్ చేసింది.

కాగా.. కొద్ది రోజులుగా జార్ఖండ్‌లో రోజువారి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఉక్క‌పోత, ఎండ వేడిమి నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌జ‌లు ఫ్యాన్లు, కూల‌ర్లు, ఏసీల‌ను వినియోగిస్తున్నారు. ఫ‌లితంగా విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. దీంతో లోడ్ మార్పు పేరుతో విద్యుత్ సిబ్బంది గంట‌ల త‌ర‌బ‌డి విద్యుత్ కోత‌లు విధిస్తున్నారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో అల్లాడిపోతున్నారు. విద్యుత్ డిమాండ్‌ను అధిగ‌మించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు అధికారులు చెబుతున్న‌ప్ప‌టికీ వాస్త‌వంలో ఆ ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.

Next Story