రామసేతు వివాదం.. అక్షయ్ కుమార్ పై విరుచుకుపడ్డ సుబ్రమణ్యస్వామి

MP Subramanian Swamy to sue Akshay Kumar. అక్షయ్ కుమార్ పై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి విరుచుకుపడ్డారు.

By Medi Samrat  Published on  30 July 2022 3:30 PM IST
రామసేతు వివాదం.. అక్షయ్ కుమార్ పై విరుచుకుపడ్డ సుబ్రమణ్యస్వామి

అక్షయ్ కుమార్ పై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి విరుచుకుపడ్డారు. అక్షయ్ కుమార్ రాబోయే చిత్రం 'రామసేతు' లో తప్పుగా చిత్రీకరించినందుకు నిర్మాతలతో పాటు నటుడిపై కూడా కేసు పెడతానని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి చెప్పారు. దీంతో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు.

శుక్రవారం సుబ్రమణ్యస్వామి ట్వీట్ లో "The suit for compensation has been finalised by my associate Satya Sabharwal Adv. I am suing Akshay Kumar, actor & Karma Media for damages caused by falsification in the portrayal of the Ram Setu issue in their film for release." అని ట్వీట్ చేశారు.

రామ సేతు అంశాన్ని సినిమాలో తప్పుగా చూపించారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. పరిహారం చెల్లించాలంటూ కేసు పెట్టనున్నామని చెప్పారు. నటుడు అక్షయ్ కుమార్‌పై కేసు వేస్తారని దయచేసి అతనికి చెప్పండని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సినిమాలో రామసేతు అంశాన్ని తప్పుగా చూపించారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. వాస్తవాలను తారుమారు చేశారని ఆరోపించారు. అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం 2022 దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది.


Next Story