మూడు రోజులు పెట్రోల్ ఫ్రీ.. బారులు తీరిన ప్రజలు
MP man distributes free petrol to celebrate birth of baby girl.ఇంధన ధరలు నిత్యం పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల
By తోట వంశీ కుమార్ Published on 16 Oct 2021 10:03 AM GMTఇంధన ధరలు నిత్యం పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పెట్రోల్ ధర రూ.110 దాటగా.. డీజిల్ ధర రూ.100 దాటింది. దీంతో వాహనదారులు వాహనాలకు బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పెట్రోల్ బంకు యజయాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజుల పాటు పెట్రోల్‌ను ఉచితంగా పోశాడు. బంకుకు ఎంత మంది వచ్చారో అంత మందికి పెట్రోల్ ఉచితంగా ఇచ్చాడు. ఇతనూ ఇలా పెట్రోల్ పోయడానికి ఓ కారణం ఉంది. తమ ఇంట్లో ఆడపిల్ల పుట్టడంతో ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. అయితే.. ఇది మన దగ్గర కాదులెండి మధ్యప్రదేశ్‌లో.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో దీపక్ సైనాని అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అక్టోబర్ 9వ తేదీన అతడి చెల్లలు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆనందంలో తేలిపోయిన సైనాని.. తన బంకుకు వచ్చిన కస్టమర్లకు పెట్రోల్ ఫ్రీ అని ప్రకటించాడు. అక్టోబర్ 13,14,15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పెట్రోల్ కొన్నవారికి 10 శాతం అదనంగా పెట్రోల్ ఉచితం అని చెప్పాడు.రూ.100లకు పెట్రోల్ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200 - 500 రూపాయలకు పెట్రోల్ కొన్నవారికి 10 శాతం పెట్రోల్ ఫ్రీగా అందించాడని స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో ఆ బంకుకు వాహనదారులు పోటెత్తారు. పెట్రోల్ ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఇలా మూడు రోజుల పాటు పెట్రోల్‌ను అందించడంతో అతడు చాలా ఫేమస్ అయ్యాడు.