హృదయవిదారకం.. 4 ఏళ్ల చిన్నారి మృత‌దేహ‌న్ని భుజాల‌పై వేసుకుని..!

MP man carries dead niece on shoulders after hospital failed to provide ambulance.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Oct 2022 2:33 PM IST
హృదయవిదారకం.. 4 ఏళ్ల చిన్నారి మృత‌దేహ‌న్ని భుజాల‌పై వేసుకుని..!

నాలుగేళ్ల చిన్నారి మృత‌దేహాన్ని ఓ వ్య‌క్తి త‌న భుజాల‌పై వేసుకుని బ‌స్టాండ్‌కు న‌డుచుకుంటూ వెలుతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ హృద‌య‌విదార‌క‌మైన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది.

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ నాలుగేళ్ల చిన్నారి త‌న స్వ‌గ్రామంలో మ‌ర‌ణించింది. పోస్టుమార్టం నిమిత్తం ఆ చిన్నారి మృత‌దేహాన్ని ఛ‌త‌ర్‌పూర్‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోస్టుమార్టం పూరైంది. అయితే.. అస‌లు స‌మ‌స్య అక్క‌డే మొద‌లైంది. ఆ చిన్నారి మృత‌దేహ‌న్ని స్వ‌గ్రామానికి త‌ర‌లించేందుకు ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ఒక్క అంబులెన్స్ కూడా లేదు. క‌నీసం ఎటువంటి వాహ‌న స‌దుపాయం లేదు. ప్రైవేటు వాహ‌నంలో తీసుకువెళ్లేంత స్తోమ‌త వారి వ‌ద్ద లేదు.

చిన్నారి బంధువు.. మృత‌దేహ‌న్ని భుజాల‌పై వేసుకుని ఆస్ప‌త్రి నుంచి బ‌స్టాండ్ వ‌ర‌కు న‌డుచుకుంటూ వెళ్లాడు. అంద‌రు ప్ర‌యాణికుల‌తో పాటు బ‌స్సు ఎక్కాడు. అయితే.. అత‌డు త‌న గ్రామానికి వెళ్లేందుకు కూడా న‌గ‌దు లేదు. తోటి ప్ర‌యాణికుడు సాయం చేయ‌డంతో బ‌స్సులో చివ‌రికి సొంతూరు చేరుకున్నాడు.

కాగా.. నాలుగు నెల‌ల క్రితం ఇదే ఆస్ప‌త్రికి వ‌చ్చిన ఓ కుటుంబానికి కూడా ఇదే త‌ర‌హ ప‌రిస్థితి ఎదురుఅయ్యాయి. దీనిపై నెటీజ‌న్ల‌తో పాటు స్థానికులు మండిప‌డుతున్నారు. ఛతర్‌పూర్‌ జిల్లాలో అత్యవసర సదుపాయాల అందుబాటుపై అధికారులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Next Story