గొంతు సవరించిన సీఎం.. 'షోలే' సాంగ్‌.. వీడియో వైర‌ల్‌

MP CM Shivraj Singh Chouhan​ sing Sholay's 'Dosti' song.సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2021 12:47 PM IST
గొంతు సవరించిన సీఎం.. షోలే సాంగ్‌.. వీడియో వైర‌ల్‌

సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు రాజ‌కీయ నాయ‌కులు ర‌క‌ర‌కాల విన్యాసాలు చేస్తుంటారు. జ‌నంతో క‌లిసి ఆడి పాడుతారు. ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సింగ‌ర్‌గా అవ‌తారం ఎత్తిన సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కైలేష్ విజ‌య్‌వ‌ర్గీయ‌తో క‌లిసి పాట పాడారు.

భోపాల్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఇద్దరు దిగ్గజ నేతలు ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం షోలే చిత్రంలోని పాట పాడారు. ఏ దోస్తీ హమ్‌ నహీ చోడేంగే అనే పాట‌ను త‌మ స్నేహానికి ప్ర‌తీక‌గా పాడారు. ముందుగా కైలేష్‌ వియ్‌ వర్గీయ పాట అందుకోగా.. ఆ తర్వాత సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ కూడా గొంతు కలిపారు. మొత్తంగా అద్భుతంగా ఆ పాటను ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story