హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

Moderate intensity quake hits Himachal Pradesh.హిమాచల్‌ప్రదేశ్‌లో శుక్ర‌వారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2021 10:11 AM IST
హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

హిమాచల్‌ప్రదేశ్‌లో శుక్ర‌వారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లా అయిన కిన్నౌర్‌లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. కిన్నౌర్‌ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్ల‌డించింది. శుక్రవారం రాత్రి 11.32 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. అయితే.. ఈ భూకంపం వల్ల జరిగిన ఎంత ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టం వాటిల్లింది అనే స‌మాచారం ఇంకా తెలియ‌రాలేదని అధికారులు చెప్పారు. కాగా.. ఇటీవ‌ల కాలంలో మ‌న‌దేశంలో ఎక్కువ మొత్తంలో భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. వీటి తీవ్ర‌త పెద్ద‌గా ఉండ‌క పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు.

Next Story