అయ్యో.. పాపం ఎమ్మెల్యే.. టపాసు కాల్చి కిందపడ్డాడు.. వీడియో వైరల్
MLA Runs away from cracker falls flat on his face.టపాసులు కాల్చడం అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉంటుంది.
By తోట వంశీ కుమార్
సాధారణంగా దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చడం అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే.. కొందరికి పటాకులు కాల్చడం అంటే భయం. అయినప్పటికీ భయపడుతూనే కాల్చుతూ ఉంటారు. కొన్ని సార్లు వారు పటాకులు కాల్చేటప్పుడు చూస్తే మనకు నవ్వు ఆగదు. ఇక్కడ కూడా ఓ ఎమ్మెల్యే పటాకుకు నిప్పును అంటించి.. దాని నుంచి దూరంగా పరుగెత్తుదామని ప్రయత్నించి అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోనేపూర్‌లో జరుగుతున్న పుట్‌బాల్ మ్యాచ్‌లను ప్రారంభించేందుకు సోనేపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వినయ్ కుమార్ సింగ్ వచ్చారు. మ్యాచ్‌ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మ్యాచ్‌లను ఆరంభించారు. అందుకు సంకేతంగా ఓ పటాకీ కాల్చారు.
खेल प्रतियोगिता का उद्घाटन करने पहुँचे पूर्व विधायक मुँह के बल गिर पड़े | Unseen India pic.twitter.com/brzK5t7iD5
— UnSeen India (@USIndia_) October 18, 2022
ఓ పటాకు నిప్పు అంటించి వెంటనే లేచి పరుగు తీశారు. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో ఆయన మొహం నేలకు గుద్దుకుంది. దెబ్బ కూడా బానే తగినట్లు తెలుస్తోంది. వెంటనే పక్కన ఉన్నవారు ఆయన్ను లేపడానికి ప్రయత్నించగా..ఎమ్మెల్యేనే లేచారు. ఆయన లేచిన తరువాత ధన్‌మంటూ శబ్ధం చేస్తూ బాంబు పేలింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.