యూట్యూబ్ చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్.. బిడ్డను చంపి..

15 ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలను చూసి తన ఇంటి వద్ద బాలిక ప్రసవించి, నవజాత శిశువును చంపిందని పోలీసులు ఆదివారం తెలిపారు.

By అంజి  Published on  6 March 2023 11:36 AM IST
Minor Girl , Maharashtra,  youtube

ప్రతీకాత్మకచిత్రం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. లైంగిక దోపిడీకి గురైన 15 ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలను చూసి తన ఇంటి వద్ద బాలిక ప్రసవించి, నవజాత శిశువును చంపిందని పోలీసులు ఆదివారం తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి బాలికను లైంగికంగా వేధించాడని పోలీసు అధికారి తెలిపారు. "తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పడం ద్వారా ఆమె తన బేబీ బంప్‌ను తన తల్లి నుండి దాచిపెట్టింది" అని అధికారి తెలిపారు.

గోప్యతను కాపాడుకోవడానికి.. స్థానిక అంబజారి ప్రాంతంలో నివసించే ఆ అమ్మాయి ఇంట్లోనే డెలివరీ కావాలనే ఆలోచనతో యూట్యూబ్ వీడియోలను చూడటం ప్రారంభించింది. ''మార్చి 2న ఆమె తన ఇంట్లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వెంటనే నవజాత శిశువును గొంతు కోసి చంపింది. పసికందు మృతదేహాన్ని తన ఇంటిలోని ఒక పెట్టెలో దాచిపెట్టింది'' అని అధికారి తెలిపారు.

పని మీద బయటకు వెళ్లిన తల్లి ఇంటికి తిరిగి రాగానే బాలిక అనారోగ్యంతో ఉండటంపై ఆరా తీసింది. ''అమ్మాయి తన తల్లికి జరిగిన విషయాన్ని మొత్తం వివరించింది. దాని తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించాం'' అని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత హత్యా నేరం మోపబడుతుందని అధికారి తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story